బాగ్దాద్‌ విమానాశ్ర‌యంపై రాకెట్ల దాడి

|

Aug 31, 2020 | 2:46 PM

బాగ్దాద్ నగరం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. ఇరాన్ రాజ‌ధాని బాగ్దాద్‌లోని విమానాశ్ర‌యం స‌మీపంలో రెండు క‌త్యుషా రాకెట్లతో దాడి జరిగింది.

బాగ్దాద్‌ విమానాశ్ర‌యంపై రాకెట్ల దాడి
Follow us on

బాగ్దాద్ నగరం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. ఇరాన్ రాజ‌ధాని బాగ్దాద్‌లోని విమానాశ్ర‌యం స‌మీపంలో రెండు క‌త్యుషా రాకెట్లతో దాడి జరిగింది. ఆదివారం అర్థరాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని ఇరాన్ మిల‌ట‌రీ అధికారులు ప్రకటించారు. కాగా, రాజ‌ధానిలోని సున్నిత ప్రాంతాల‌పై బాంబులు పేల‌డం ఈ వారంలో ఇది మూడోసారి.

మరోవైపు, బాగ్దాద్‌లోని అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ ఉండే గ్రీన్‌జోన్‌లో శ‌నివారం ఒక రాకెట్ ప‌డింది. ఈ ప్రాంతంలో ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, విదేశీ క‌మిష‌న‌రేట్లను టార్గెట్ చేస్తూ దాడి జరిగింది. అయితే, ఇక్క‌డ కూడా ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని వెల్ల‌డించారు. దీంతో అప్రమత్తమైన సైనిక వర్గాలు భద్రతను కట్టదిట్టం చేశారు. అయినప్పటికీ బాగ్ధాద్ విమానాశ్రయంపై దాడి జరిగింది.

కాగా,గ‌త గురువారం కూడా న‌గ‌రంలో ఇలాంటి పేలుళ్లే సంభ‌వించాయి. ఈ దాడుల‌పై ఇరాన్ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే, ఇరాన్ ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు క‌లిగిన మిలీషియా గ్రూప్‌లే ఈ దాడుల‌కు కార‌ణ‌మ‌ని అగ్ర‌రాజ్యం అమెరికా ఆరోపించింది. ఇరు దేశాల మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన కారణాలను మాత్రం ఇరాన్ సైనికాధికారులు వెల్లడించలేదు.