Robbery Gang Arrested: తమిళనాడులో ముత్తూట్‌‌ఫైనాన్స్‌లో బంగారం చోరీ.. హైదరాబాద్‌లో పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు..

Robbery Gang Arrested: తమిళనాడులోని హోసూరులో గల ముత్తూట్‌ ఫైనాన్స్ కార్యాలయంలో బంగారం లూటీ చేసిన కర్ణాటక..

Robbery Gang Arrested: తమిళనాడులో ముత్తూట్‌‌ఫైనాన్స్‌లో బంగారం చోరీ.. హైదరాబాద్‌లో పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు..

Edited By:

Updated on: Jan 23, 2021 | 10:14 AM

Robbery Gang Arrested: తమిళనాడులోని హోసూరులో గల ముత్తూట్‌ ఫైనాన్స్ కార్యాలయంలో బంగారం లూటీ చేసిన కర్ణాటక దొంగల ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. సైబరాబాద్ పోలీసులు ఈ దొంగల ముఠా సభ్యులను శనివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం దొంగతనం చేయగా.. ఇవాళ తెల్లవారు జామున ఆ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో శుక్రవారం ఉదయం భారీ దోపిడీ జరిగింది. హోసూరు-బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ కార్యాలయం తెరుచుకున్న కొద్ది సేపటికే దోపిడీ దొంగలు చొరబడ్డారు. కార్యాలయంలోని సిబ్బందిని బెదిరించి.. భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుకుపోయారు. దాదాపు 25 కిలోలకు పైగా బంగారం, లాకర్లలో ఉన్న రూ. 96వేల నగదు కూడా దోచుకెళ్లినట్లు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపహరణకు గురైన బంగారం విలువ సుమారు రూ.7.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also read:

Beer yoga: బీరు సేవిస్తూ యోగా.. భలే కిక్ అంటున్న యువత..ఇంతకీ ఎక్కడంటే..?

Team India Pacer: త‌న‌కు తాను బ‌హుమ‌తి అందించుకున్న టీమిండియా బౌల‌ర్‌… కారులో షికారు…