కడపలో ఓవైపు దుంగల స్మగ్లర్లు, మరోవైపు దోపిడీ దొంగలు
కడప జిల్లాలో ఓ వైపు కలప స్మగ్లర్లు రెచ్చిపోతుంటే, మరోవైపు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. జిల్లాలోని వేంపల్లెలో చోరబడ్డ దొంగలు ఇల్లు గుల్ల చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కడప జిల్లాలో ఓ వైపు కలప స్మగ్లర్లు రెచ్చిపోతుంటే, మరోవైపు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. జిల్లాలోని వేంపల్లెలో చోరబడ్డ దొంగలు ఇల్లు గుల్ల చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే… గండి – పులివెందుల బైపాస్ రోడ్డులోని ఎంఎంఆర్ కళ్యాణ మండపం సమీపంలో మహమ్మద్ రఫి అనే వ్యక్తి ఇంట్లో చొరబడ్డ దొంగలు ఇళ్లంతా లూటీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు, ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురు చేశారు. విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వేంపల్లి సిఐ ఆదేశాలతో క్లూస్ టీం ఎస్ఐ రుక్మిణి దేవి,ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ లు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి దుండగుల వేలి ముద్రలను క్షుణ్ణంగా పరిశీలించి సేకరించారు. దుండగులు గతంలో చోరికి పాల్పడిన వారుగా ఉన్నట్లు క్లూస్ టీం ఎస్ఐ రుక్మిణి దేవి తెలిపారు. దొంగతనం జరిగిన తీరును బట్టి దొంగలు చాకచక్యంగా చోరికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
Also Read :
వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం