ఎలక్ట్రిక్(EV) వాహనదారులకు కేంద్రం బంపరాఫర్!

| Edited By:

Jun 20, 2019 | 3:55 PM

మోదీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. 2030 నుంచి అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలనే విక్రయించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సరికొత్త ప్రతిపాదనను అమలు పరుస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వినియోగాన్ని పెంచేందుకు అద్భుతమైన ప్రతిపాదన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వెహికల్స్‌ జిస్ట్రేషన్ చార్జీలు లేకుండా చేయాలని భావిస్తోంది. కేంద్రం బుధవారం విడుదల చేసిన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించి ఎవరైనా […]

ఎలక్ట్రిక్(EV) వాహనదారులకు కేంద్రం బంపరాఫర్!
Follow us on

మోదీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. 2030 నుంచి అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలనే విక్రయించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సరికొత్త ప్రతిపాదనను అమలు పరుస్తోంది.

పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వినియోగాన్ని పెంచేందుకు అద్భుతమైన ప్రతిపాదన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వెహికల్స్‌ జిస్ట్రేషన్ చార్జీలు లేకుండా చేయాలని భావిస్తోంది. కేంద్రం బుధవారం విడుదల చేసిన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించి ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకుంటే 30 రోజులలోగా ఇవ్వొచ్చు.

కొత్త ముసాయిదా ప్రకారం బ్యాటరీ సాయంతో నడిచే వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ చార్జీలు ఉండవు. ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తారు. టూవీలర్ సహా అన్ని ఈవీలకు ఇదే వర్తిస్తుంది.