మెయిన్‌పురిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా సమీపంలో ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.