మరికొన్నేళ్లలో ముంబై నగరం మునిగిపోనుందా..?

త్వరలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మునిగిపోనుందా..?. నిత్యం పెరుగుతోన్న సముద్రమట్టాల ప్రభావం మహానగరానికి పెను ముప్పు తీసుకురాబోతుందా..?. అవును తాజాగా ఓ సంస్థ చేసిన అధ్యయనం అటువంటి డేంజర్ బెల్స్‌నే మోగిస్తుంది.  2050 క‌ల్లా ముంబై తీర ప్రాంతం అంతా నీట మున‌గ‌నున్న‌ట్లు చెప్పింది. ఈ ముప్పు కోల్‌కతాకు కూడా ఉన్నట్లు సర్వే తేల్చింది.  పెరుగుతున్న సముద్ర మట్టాలపై క్లైమేట్ సెంట్రల్​కు చెందిన స్కాట్ ఏ కల్ప్​, బెంజమిన్ హెచ్​ స్ట్రాస్ చేసిన పరిశోధనలో […]

మరికొన్నేళ్లలో ముంబై నగరం మునిగిపోనుందా..?
Follow us

|

Updated on: Oct 31, 2019 | 3:24 AM

త్వరలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మునిగిపోనుందా..?. నిత్యం పెరుగుతోన్న సముద్రమట్టాల ప్రభావం మహానగరానికి పెను ముప్పు తీసుకురాబోతుందా..?. అవును తాజాగా ఓ సంస్థ చేసిన అధ్యయనం అటువంటి డేంజర్ బెల్స్‌నే మోగిస్తుంది.  2050 క‌ల్లా ముంబై తీర ప్రాంతం అంతా నీట మున‌గ‌నున్న‌ట్లు చెప్పింది. ఈ ముప్పు కోల్‌కతాకు కూడా ఉన్నట్లు సర్వే తేల్చింది.  పెరుగుతున్న సముద్ర మట్టాలపై క్లైమేట్ సెంట్రల్​కు చెందిన స్కాట్ ఏ కల్ప్​, బెంజమిన్ హెచ్​ స్ట్రాస్ చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముందుగా అంచ‌నా వేసిన దాని క‌న్నా.. ప‌రిస్థితులు మ‌రింత భ‌యాన‌కంగా ఉండ‌నున్నట్లు ఆ సంస్థ అధ్యయనంలో తేలింది.

ప్రతి ఏడాదికి పెరిగిపోతున్న వరదల తాకిడికి  సౌత్ ముంబైలోని చాలా వరకు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రిపోర్ట్ తేల్చింది.  వాతావ‌ర‌ణ మార్పుల‌ను అవగాహన చేసుకోకుంటే…భారత్​ సహా చాలా వరకు ఆసియా దేశాలలోని హై టైడ్ లైన్(వార్షిక వరదల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలు) పరిధిలో నివసించే జనాభా కూడా ఇప్పటితో పోల్చుకుంటే ఐదు నుంచి పది రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 2050 నాటికి 34 కోట్ల మంది హై టైడ్ లైన్ ప్రజలు  నివాసం ఉంటారని.. ఈ శతాబ్దం చివరినాటికి ఆ సంఖ్య 63 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. న్యూ జెర్సీకి చెందిన ఆ సంస్థ త‌న నేచ‌ర్ క‌మ్యూనికేష‌న్స్ జ‌ర్న‌ల్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

వరల్డ్‌వైడ్‌గా.. ప్రస్తుతం 25 కోట్ల మంది వరదల కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రాంతాలలో నివసిస్తున్నారని పరిశోధన తెలిపింది. భీక‌ర వ‌ర‌ద‌ల వ‌ల్ల‌ ప్రమాదం బారిన పడే ప్రాంతాల్లోని 70 శాతం మంది ప్రజలు చైనా, బంగ్లాదేశ్, భారత్, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్​, జపాన్​ దేశాలలోనే ఉంటున్నట్లు స్టడీ అంచనా వేసింది.