డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్టయ్యారు. ఆమెను ఎన్.సీ.బీ అధికారులు కస్టడీకి కోరనున్నారు. నాలుగు రోజులుగా ఎన్.సీ.బీ రియాను విచారిస్తోన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసు విచారణలో 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో వారికి ఎన్.సీ.బీ నోటీసులు జారీ చేయనుంది. కాగా విచారణలో తనకు డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు రియా అంగీకరించింది. డ్రగ్స్ స్మగ్లర్ బాసిత్ ను ఐదు సార్లు కలిసినట్టు పేర్కొంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియా సోదరుడు షోవిక్ అరెస్టయ్యాడు. రియా సూచనతో దివంగత నటుడు సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు షోవిక్ వాంగ్మూలం ఇచ్చాడు.
Also Read :