‘దిశ ఎన్‌కౌంటర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..

రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రాజెక్ట్‌కు నాంది పలికారు. తెలంగాణలో జరిగిన దిశ ఘటన ఆధారంగా తీస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

దిశ ఎన్‌కౌంటర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..

Updated on: Sep 05, 2020 | 11:49 AM

RGV New Movie Update: రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రాజెక్ట్‌కు నాంది పలికారు. తెలంగాణలో జరిగిన దిశ ఘటన ఆధారంగా తీస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అలాగే నవంబర్ 26న ఈ మూవీ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. నవంబర్ 26, 2019లో దిశ ఘటన జరగగా, ఏడాది తరువాత అదే రోజున వర్మ దిశ మూవీని విడుదల చేస్తున్నట్లు చెప్పడం విశేషం.

గత ఏడాది హైదరాబాద్ శివార్లలో నలుగురు యువకులు దిశ అనే అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆ తదుపరి కాల్చి వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేపగా, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నలుగురు యువకులను పట్టుకున్న పోలీసులు, తరువాత ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు.

కాగా ఈ ఘటనపై మూవీ చేస్తానని వర్మ ఎప్పుడో ప్రకటించారు. నలుగురు నిందుతుల్లో ఒకడైన జొల్లు నవీన్ భార్యను వర్మ ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఆమెను తన ఆఫీస్ కి పిలిపించుకున్న వర్మ అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. కాగా నేడు ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచేశారు.