AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV D-Company Teaser: దావూద్ ఇబ్రహీం చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు…

D-Company Teaser Released: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముంబైతో పాటు

RGV D-Company Teaser: దావూద్ ఇబ్రహీం చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు...
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 25, 2021 | 11:47 PM

Share

D-Company Teaser Released: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముంబైతో పాటు యావత్ దేశాన్ని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా టైటిల్ ప్రకటనతో అలజడి రేపిన వర్మ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

టీజర్ గమనిస్తే పూర్తిగా ముంబై నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ‘ఏ పీక్ ఇన్ టూ డీ కంపెనీ’ పేరుతో విడుదల చేసిన ఈ టీజర్ అధ్యంతం ఆసక్తిగా సాగుతోంది. దావూద్ డీ కంపెనీ ఎలా ప్రారంభించాడు, ఎలా ఒక పెద్ద డాన్‌గా మారాడులాంటి వాటిని వర్మ ఈ టీజర్‌లో ప్రస్తావించారు. ఇక టీజర్‌లో వచ్చే.. ‘ఇది అలాంటిలాంటి కంపెనీ కాదు.. హింసే దీనికి పెట్టబడి.. నా బలం లేకపోతే నీ బుద్ధి ఏం చేస్తుంది’ అన్న డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్‌తో పాటు వర్మ మరో వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ‘ఇన్‌సైట్ ఆఫ్ డీ కంపెనీ’ పేరుతో అండర్ వరల్డ్‌పై తనకు ఉన్న అవగాహన, తనకు తెలిసిన విషయాలను పంచుకున్నాడు. ఇక డీ కంపెనీ.. నా కలల ప్రాజెక్ట్‌ అని, ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌గా దావూద్‌ ఎలా మార్చాడనేది ఈ సినిమాలో చూపించనున్నామని వర్మ తెలిపాడు. ఈ సినిమాను ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని వర్మ చెప్పుకొచ్చాడు.

Also Read: Actress Jayashree Suicide: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ ఫేమ్ జయశ్రీ ఆత్మహత్య.. తీవ్ర ఒత్తిడితో..!