సినిమా రంగం డ్రగ్స్‌కు బానిస..: చంద్రవదన్ సంచలన వ్యాఖ్యలు

డ్రగ్స్‌ లింక్స్‌పై రిటైర్డ్ ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్ సంచలన వ్యాఖ్యలు చేశారు‌. టాలీవుడ్‌, బాలీవుడ్ అన్న తేడాలేదు.. సినిమా రంగమంతా డ్రగ్స్‌కు బానిసైందన్నారు. డ్రగ్స్‌ కేసులో గతంలో తాము విచారించిన వారంతా ఈ విషయాన్ని అంగీకరించారని చెప్పుకొచ్చారు.

సినిమా రంగం డ్రగ్స్‌కు బానిస..: చంద్రవదన్ సంచలన వ్యాఖ్యలు
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 13, 2020 | 7:27 PM

Film Industry is Addicted : డ్రగ్స్‌ లింక్స్‌పై రిటైర్డ్ ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్ సంచలన వ్యాఖ్యలు చేశారు‌. టాలీవుడ్‌, బాలీవుడ్ అన్న తేడాలేదు.. సినిమా రంగమంతా డ్రగ్స్‌కు బానిసైందన్నారు. డ్రగ్స్‌ కేసులో గతంలో తాము విచారించిన వారంతా ఈ విషయాన్ని అంగీకరించారని చెప్పుకొచ్చారు. సినిమా ప్రపంచంలో ఒత్తిళ్లకు లోనవుతామని, నటులుగా గ్లామర్‌ను కాపాడుకోడానికి డ్రగ్స్‌ వాడక తప్పదని చాలా మంది చెప్పారని పెద్ద బాంబు పేల్చారు చంద్రవదన్‌. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌పై డ్రగ్స్‌ ఆరోపణల నేపథ్యంలో చంద్రవదన్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

డ్రగ్స్‌కు పరిథులు లేవంటున్నారు చంద్రవదన్‌. టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాదు డ్రగ్స్‌ మూలాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన విచాణలో ఏం తేలిందో చెప్పను అంటూనే అసలు కథంతా బయట పెట్టేశారు. తాము ప్రశ్నించిన వారిలో అనేక మంది డ్రగ్స్‌ వాడకంపై క్లారిటీ ఇచ్చారని తెలిపారు. నేను ఒక్కడినే డ్రగ్స్‌ వాడుతున్నానా? చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారని బయటపెట్టారు చంద్రవదన్‌.

సుశాంత్‌ మర్డర్‌ కేసుకు లింక్‌గా నటి రకుల్‌ పేరు వెలుగులోకి రావడం, గతంలో జరిగిన డ్రగ్స్‌ విచారణపై రిటైర్డ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కథను కొత్త మలుపు తిప్పాయి. రకుల్‌ ఒక్కతేనా.. టాలీవుడ్‌లో ఇంకా చాలా మందికి ఈ డ్రగ్స్‌ లింక్స్‌ ఉన్నాయా? అనే సందేహాలు మొదలయ్యాయి.

రియా పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోందని, అది టాలీవుడ్‌ వరకు రాదని మాత్రం చెప్పలేమని కూడా క్లారిటీ ఇచ్చారు చంద్రవదన్‌. హైదరబాద్‌లో ఎక్సైజ్‌శాఖ దర్యాప్తు తర్వాత.. ఇక్కడి వారు డ్రగ్స్‌ కోసం ఇతర నగరాలకు వెళ్తున్నారని అన్నారు చంద్రవదన్‌. ఎన్సీబీ దర్యాప్తు , నేపథ్యంలో డ్రగ్స్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందంటున్నారు చంద్రవదన్‌.