AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: దేశీయ విమానాల‌పై న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు ఆంక్ష‌లు కొన‌సాగింపు

ఇండియాలో కరోనావైరస్ తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది.

Breaking: దేశీయ విమానాల‌పై న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు ఆంక్ష‌లు కొన‌సాగింపు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 24, 2020 | 10:06 PM

ఇండియాలో కరోనావైరస్ తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది. ఈ సాయంత్రం విడుదల చేసిన నోటిఫికేషన్ లో కూడా దేశీయ విమాన ఛార్జీలపై గ‌తంలో విధించిన నియంత్ర‌ణ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 25 న దేశీయ విమానాలను నిలిపివేశారు. కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ఈ నెల ప్రారంభంలో మాట్లాడుతూ గ‌తంతో పోలిస్తే దీపావళి నాటికి ప్ర‌యాణించే దేశీయ విమానాల సంఖ్య 55 – 60 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశీయ విమానయాన పరిశ్రమ వివిధ రంగాలకు ఛార్జీల పరిమితితో, పరిమిత సామర్థ్యంతో పనిచేస్తున్నందున ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.