ఆర్బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు కొవిడ్ బారిన పడ్డారు. కరోనా  పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా తన  ట్వీట్‌లో ప్రకటించారు. తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి అంతా ఆరోగ్యం బాగానే ఉందని అందులో పేర్కొన్నారు. స్వీయ నిర్బంధంలోకి...

ఆర్బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్

Updated on: Oct 25, 2020 | 8:06 PM

RBI Governor Shaktikanta Das : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు కొవిడ్ బారిన పడ్డారు. కరోనా  పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా తన  ట్వీట్‌లో ప్రకటించారు. తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి అంతా ఆరోగ్యం బాగానే ఉందని అందులో పేర్కొన్నారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. తనను ఇటీవల కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని.. శక్తికాంత దాస్‌ సూచించారు. స్వీయ నిర్బంధంలో ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగించనున్నట్లుగా తెలిపారు. ఆర్‌బీఐ యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌, టెలిఫోన్ల ద్వారా అందుబాటులో ఉంటానని ట్విట్టర్ ఖాతాలో శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌కు కరోనా అని ప్రకటించడంతో ఆయన వాట్సప్ మెసెజ్‌లతో నిండిపోతోంది. ముందుగా ఆయనకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. టేక్ కేర్  అంటూ ట్వీట్ చేశారు.

Follow Us