సీఎం జ‌గ‌న్ కు నారా లోకేశ్ లేఖ‌..

|

May 23, 2020 | 3:07 PM

పొగాకు రైతులను కరోనా తీవ్రంగా దెబ్బ‌తీసింద‌ని నారా లోకేశ్ ఆవేద‌న వ్య‌క్తం చేవారు. ఏపీలో రైతులు గత ఏడాది కిలో పొగాకు 170 రూపాయల చొప్పున విక్ర‌యాలు జ‌రిపార‌ని, ఇప్పుడు అది 130 నుంచి 150 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని వివ‌రించారు. వారిని గ‌వ‌ర్న‌మెంట్ వెంట‌నే ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. పొగాకు వేలం సరిగా జరిగ్గా జ‌ర‌గ‌డం లేద‌ని..ఈ-వేలంలో త‌క్కువ ధ‌ర‌లు ప‌ల‌క‌డం వ‌ల్ల‌ రైతులను […]

సీఎం జ‌గ‌న్ కు నారా లోకేశ్ లేఖ‌..
Follow us on

పొగాకు రైతులను కరోనా తీవ్రంగా దెబ్బ‌తీసింద‌ని నారా లోకేశ్ ఆవేద‌న వ్య‌క్తం చేవారు. ఏపీలో రైతులు గత ఏడాది కిలో పొగాకు 170 రూపాయల చొప్పున విక్ర‌యాలు జ‌రిపార‌ని, ఇప్పుడు అది 130 నుంచి 150 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని వివ‌రించారు. వారిని గ‌వ‌ర్న‌మెంట్ వెంట‌నే ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. పొగాకు వేలం సరిగా జరిగ్గా జ‌ర‌గ‌డం లేద‌ని..ఈ-వేలంలో త‌క్కువ ధ‌ర‌లు ప‌ల‌క‌డం వ‌ల్ల‌ రైతులను తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. క‌రోనా కార‌ణంగా స‌రైన స‌మ‌యంలో రైతులు తమ ఉత్పత్తిని అమ్ముకోలేక.. 40 రోజుల పాటు నిల్వ చేసుకున్నారని తెలిపారు.

ఇప్పుడు అమ్మ‌కాలు జ‌రుపుదామంటే.. నాణ్యత తగ్గిందనే సాకు చూపుతుండటంతో రైతుల‌కు న‌ష్టాలు త‌ప్ప‌ట్లేద‌ని లోకేశ్ వివ‌రించారు. తాజా సంక్షోభ స‌మ‌యంలో.. రైతులకు పొగాకు బార్న్‌పై దాదాపు 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంద‌ని లోకేష్ వెల్ల‌డించారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేశారనే ఆందోళ‌న రైతుల నుంచి వ్య‌క్తమ‌వుతుంద‌ని తెలిపారు. ఒక ప్రతినిధుల బృందాన్ని..పొగాకు రైతులతో ఢిల్లీకి పంపాలని, కేంద్రం ప్ర‌భుత్వంతో పొగాకు రైతుల సమస్యను చర్చించి వారికి న్యాయం జరిగేలా ప్ర‌భుత్వం చూడాల‌ని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అవ‌కాశం చేసుకుని రైతుల‌కు ఇబ్బందిపెడుతోన్న వారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు.