సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్లను తెరవాలని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ రాశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసివేయడం వల్ల హైదరాబాద్ ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సైనికాధికారులు మున్సిపల్ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని పేర్కొన్నారు.
Have appealed to Hon’ble Defence Minister @rajnathsingh Ji to remove unauthorised road blocks in Secunderabad Cantonment area
Millions of Hyderabad citizens are being inconvenienced due to arbitrary & random decisions of local military authorities against standard MoD protocol pic.twitter.com/bmY5M7WfXd
— KTR (@KTRTRS) August 16, 2020
సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్‌లోని ఆర్మీ రహదారులపై మళ్లీ ఆంక్షలు విధిస్తున్న నగరవాసులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏవోసీ రోడ్లపై తరుచూ సాధారణ పౌరుల రాకపోకలను నిషేధిస్తున్నారు. రక్షణశాఖ అధికారులు అంతర్గత రోడ్లను మూసివేయడంతో ఆ రోడ్లతో లింక్ ఉన్న న్యూ గాంధీనగర్, శక్తినగర్, రామకృష్ణాపురం, మల్కాజిగిరి, సఫిల్‌గూడ ప్రాంతాలకు వెళ్లాల్సిన రాకపోకలు తెగిపోయాయి. దీనికి సంబంధించి లోకల్ మిలిటరీ అధికారులు గేట్ల ఏర్పాటు చేశారు. ఫలితంగా సామాన్యులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు నాలుగైదు కిలోమీటర్లు చుట్టూరా తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రహదారులపై అంక్షలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు.