AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంటా రూటే సపరేట్..గెలుపుకు అదేనా సీక్రెట్!

గంటా శ్రీనివాసరావు..ఈ నేమ్‌కు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఇమేజ్ ఉంది. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలవడం, ఎమ్మెల్యేగా గెలిస్తే అధికార పార్టీలో మంత్రి పదవి అధిరోహించడం గంటా స్టైల్. ఉత్రరాంధ్రలో కాపు సామాజిక వర్గంలో బలమైన రాజకీయ నేతగా ఘంటా అవతరించారు. మొదట టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఈ నేత… ఆ తర్వాత మరో రెండు పార్టీలు మారి… 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలోనే చేరారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో పాటు మంత్రి […]

గంటా రూటే సపరేట్..గెలుపుకు అదేనా సీక్రెట్!
Ram Naramaneni
|

Updated on: May 25, 2019 | 7:26 AM

Share

గంటా శ్రీనివాసరావు..ఈ నేమ్‌కు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఇమేజ్ ఉంది. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలవడం, ఎమ్మెల్యేగా గెలిస్తే అధికార పార్టీలో మంత్రి పదవి అధిరోహించడం గంటా స్టైల్. ఉత్రరాంధ్రలో కాపు సామాజిక వర్గంలో బలమైన రాజకీయ నేతగా ఘంటా అవతరించారు. మొదట టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఈ నేత… ఆ తర్వాత మరో రెండు పార్టీలు మారి… 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలోనే చేరారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో పాటు మంత్రి కూడా అయ్యారు. అయితే తాజా ఎన్నికల్లో  ఆయన గెలుపుపై చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేసినా… గంటా మాత్రం తన విక్టరీ పరంపరను కొనసాగించారు. ఇప్పటిదాకా ఒకసారి ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మేల్యేగా విజయం సాధించారు గంటా.

ఆయన మరోసారి కూడా గెలిచే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ నిపుణులు. అందుకు ప్రధాన కారణం గంటా స్ట్రాటజీనే. ఓ సారి గెలిచిన సీటులో మళ్లీ వెంటనే పోటీ చేయడం గంటా స్టైల్ కాదు. రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఇదే మంత్రాన్ని పాటిస్తూ వస్తూ.. వరుసగా ఐదు సార్లు జయకేతనం ఎగురవేశారు.

రాజకీయాల్లోకి వచ్చిన తొలిసారి 1999లో అనకాపల్లి టీడీపీ ఎంపీగా గంటా విజయం సాధించారు. ఆ తర్వాత  2004లో నియోజకవర్గం మారిన ఆయన చోడవరాన్ని ఎంపిక  చేసుకుని ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడినా… గంటా మాత్రం విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మళ్లీ నియోజకవర్గం మారారు. ఈ సారి ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి అసెంబ్లీని స్థానాన్ని ఎంచుకున్నారు. ప్రజారాజ్యం చాలా చోట్ల ఓటమిపాలైనా గంటా మాత్రం గెలుపు సవారి చేశారు . ఆ తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయిన గంటా… ఏకంగా మంత్రి పదవి కూడా చేపట్టారు.

ఇక 2014 ఎన్నికల నాటికి టీడీపీ గూటికి చేరిన గంటా… గెలుపు స్ట్రాటజీని మాత్రం మార్చలేదు. ఈ సారి కూడా తన సీటును మార్చేసుకున్న గంటా… అనకాపల్లి నుంచి భీమిలికి మారిపోయారు. వరుసగా మూడోసారి విక్టరీ సాధించి చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రిగా పదవిని దక్కించుకున్నారు. ఇక తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన గంటా.. విశాఖ ఉత్తర స్థానాన్ని ఎంచుకున్నారు. వరుసగా నాలుగోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. గెలుపు మంత్రం ఒడిసి పట్టారు కాబట్టే రాజకీయం చేసేటప్పుడు సెంటిమెంట్‌ను, స్ట్రాటజీని గంటా అస్సలు మిస్ అవ్వరు.