ప్రశంస… కరోనా కాలంలోనూ ఆర్థిక స్థిరత్వం…. ఆర్బీఐని మెచ్చుకున్న మాజీ గవర్నర్… ఏం అన్నారంటే…

కొవిడ్‌-19 పెను సంక్షోభాన్ని అధిగమించడం చాలా కష్టమని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు.

ప్రశంస... కరోనా కాలంలోనూ ఆర్థిక స్థిరత్వం.... ఆర్బీఐని మెచ్చుకున్న మాజీ గవర్నర్... ఏం అన్నారంటే...

Edited By:

Updated on: Dec 17, 2020 | 7:21 AM

కొవిడ్‌-19 పెను సంక్షోభాన్ని అధిగమించడం చాలా కష్టమని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక స్థిరతను కాపాడటంలో ఆర్బీఐ విజయవంతమైందని ఆయన కొనియాడారు. ఆయన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన వర్చువల్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ… కష్ట కాలంలో రిజర్వు బ్యాంకు చేపట్టిన చర్యలన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించినవని అన్నారు.

సంకోభాన్ని నిరోధించి, ఆర్థిక స్థిరతను కాపాడాలన్న లక్ష్యంతోపాటు ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు నిధులు సమకూర్చాలన్న లక్ష్యంతో పలు విధానాలను చేపట్టారని  గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆర్బీఐ చేపట్టిన చర్యల్లో కొన్ని కీలక చర్యలున్నాయని ప్రశంసించారు.  ఓపెన్‌ మార్కెట్‌ కార్యకలాపాల (ఓఎంవో) ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి అసాధారణ రీతిలో నగదును చొప్పించారని అన్నారు.  నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)తోపాటు చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌)ని, రెపో, రివర్స్‌ రెపో రేట్లను తగ్గింపు మంచి చర్యని అన్నారు. రుణాలపై మారటోరియంను ప్రకటించి దాన్ని పొడిగించడం లాంటివి ఈ చర్యల్లో ప్రధానమైనవని దువ్వూరి తెలిపారు.