ఆ ఊర్లో లిక్క‌ర్ ని ఎలుకలు తాగేస్తున్నాయట..!

|

Apr 26, 2020 | 4:21 PM

బియ్యం, గోధుమ‌లు, పప్పులు, పండ్లు కూరగాయలను ఎలుక‌లు తింటాయ‌న్న‌ది మ‌నుకు తెలిసిన విష‌య‌మే. కొన్నిసార్లు అవి బ‌ట్ట‌ల్ని, పుస్త‌కాల్ని కూడా కొట్టేస్తూ ఉంటాయి. కానీ.. మద్యం తాగే ఎలుకల్ని మీరు ఎప్పుడైనా చూశారా?. అది కూడా.. బాటిల్స్ కి..బాటిల్స్ లేపేసే రాట్స్ ఉంటాయా..?. మేము అయితే ఎక్క‌డా సీన్ చూడ‌లేదు. కానీ ప్రకాశం జిల్లా అద్దంకి మద్యం షాపుల్లో మ‌ద్యాన్ని ఎలుకలు తాగుతున్నాయట. స్టాక్ లో ఎందుకు తేడా వచ్చింది అని ప్రశ్నించిన అధికారులకు సదరు షాపు […]

ఆ ఊర్లో లిక్క‌ర్ ని ఎలుకలు తాగేస్తున్నాయట..!
Follow us on

బియ్యం, గోధుమ‌లు, పప్పులు, పండ్లు కూరగాయలను ఎలుక‌లు తింటాయ‌న్న‌ది మ‌నుకు తెలిసిన విష‌య‌మే. కొన్నిసార్లు అవి బ‌ట్ట‌ల్ని, పుస్త‌కాల్ని కూడా కొట్టేస్తూ ఉంటాయి. కానీ.. మద్యం తాగే ఎలుకల్ని మీరు ఎప్పుడైనా చూశారా?. అది కూడా.. బాటిల్స్ కి..బాటిల్స్ లేపేసే రాట్స్ ఉంటాయా..?. మేము అయితే ఎక్క‌డా సీన్ చూడ‌లేదు. కానీ ప్రకాశం జిల్లా అద్దంకి మద్యం షాపుల్లో మ‌ద్యాన్ని ఎలుకలు తాగుతున్నాయట. స్టాక్ లో ఎందుకు తేడా వచ్చింది అని ప్రశ్నించిన అధికారులకు సదరు షాపు నిర్వాహకులు చెప్పిన మాట ఇది.ఈ ఆన్స‌ర్ విని ప‌రిశీల‌నకు వ‌చ్చిన అధికారులు ఒక్క‌సారిగా షాక్ కి గుర‌య్యారు

అద్దంకి సర్కిల్‌ పరిధిలోని మొత్తం 30 షాప్స్ లో మొత్తం 13 చోట్ల స్టాక్ లో డిఫ‌రెన్స్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఇలాంటి సమాధానాలపై కఠినంగా స్పందించారు. వివిధ షాపుల్లో పని చేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ మద్యం బాటిల్స్ ను ఇళ్ల‌కు త‌ర‌లించి.. అధిక రేట్ల‌కు విక్రయించారనే ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై అద్దంకి ఎక్సైజ్‌ సీఐ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. లిక్క‌ర్ స్టాక్ విష‌యంలో వ్యత్యాసం నిజ‌మేన‌ని చెప్పారు. ఎంక్వైరీ చేసి ఆయా షాపుల్లో పని చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.