AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిజిటల్ స్క్రీన్‌పై మెరవనున్న మరో హీరోయిన్.. పాన్ ఇండియా వెబ్ సిరీస్‌లో అందాల ‘రాశీ’.

ఇప్పటికే తెలుగు నుంచి సమంత, తమన్నా, సాయిపల్లవిలతో పాటు పలువురు అగ్ర హీరోయిన్లు వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో...

డిజిటల్ స్క్రీన్‌పై మెరవనున్న మరో హీరోయిన్.. పాన్ ఇండియా వెబ్ సిరీస్‌లో అందాల ‘రాశీ’.
Rashi khanna
Narender Vaitla
|

Updated on: Dec 26, 2020 | 8:25 AM

Share

rashi khanna in web series: లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడం, బడా నిర్మాణ సంస్థలు ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం.. కారణమేదైనప్పటికీ ఇటీవల ఓటీటీల హవా కొనసాగుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుడి అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం హాలీవుడ్‌కే పరిమితమైన వెబ్ సిరీస్‌లు ఇప్పుడు భారత్‌లోనూ సత్తా చాటుతున్నాయి. నిర్మాణ సంస్థలు కూడా ఖర్చుకు వెనుకడుగు వేయకుండా సినిమా బడ్జెట్‌తో సమానంగా వెబ్ సిరీస్‌లకు కేటాయిస్తుండడంతో  డిజిటల్ స్క్రీన్‌పై బడా తారలు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి సమంత, తమన్నా, సాయిపల్లవిలతో పాటు పలువురు అగ్ర హీరోయిన్లు వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి అందాల తార రాశీ ఖన్నా కూడా వచ్చి చేరింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకుడు తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా రాశీని ఓకే చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో పాటు తమిళ ఇండస్ట్రీకి చెందిన విజయ్ సేతుపతితో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. ఇండియాలో ఉన్న ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే క్రమంలోనే దర్శకుడు ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన వారిని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్‌ రాశీ ఖన్నా కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..