శ్రీవారి విరాళాలు పక్కదారి పడుతున్నాయి: రమణ దీక్షితులు

| Edited By:

Apr 01, 2019 | 11:14 AM

తిరుమల ఆలయ సంస్థ టీటీడీపై ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు మరోసారి సంచనల ఆరోపణలు చేశారు. శ్రీవారికి భక్తులిచ్చే విరాళాలను ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తూ టీటీడీ పక్కతోవ పట్టిస్తోందని ఆయన అన్నారు. పచ్చ కర్పూరం, కస్తూరి నుంచి పుష్పాలు, వస్త్రాలు, అలంకరణ, ఉత్సవాలన్నింటికీ దాతలే సాయం చేస్తున్నా ఏ ఒక్క రూపాయి స్వామి సేవకు వెళ్లడం లేదని ఆయన విమర్శించారు. రోజుకు దాదాపు రూ.2.5కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు స్వామికి విరాళాల రూపంలో అందుతుండగా.. వాటిని […]

శ్రీవారి విరాళాలు పక్కదారి పడుతున్నాయి: రమణ దీక్షితులు
Follow us on

తిరుమల ఆలయ సంస్థ టీటీడీపై ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు మరోసారి సంచనల ఆరోపణలు చేశారు. శ్రీవారికి భక్తులిచ్చే విరాళాలను ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తూ టీటీడీ పక్కతోవ పట్టిస్తోందని ఆయన అన్నారు. పచ్చ కర్పూరం, కస్తూరి నుంచి పుష్పాలు, వస్త్రాలు, అలంకరణ, ఉత్సవాలన్నింటికీ దాతలే సాయం చేస్తున్నా ఏ ఒక్క రూపాయి స్వామి సేవకు వెళ్లడం లేదని ఆయన విమర్శించారు.

రోజుకు దాదాపు రూ.2.5కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు స్వామికి విరాళాల రూపంలో అందుతుండగా.. వాటిని ఉద్యోగుల అవసరాలకు, ఇంజనీరింగ్ పనులకు, కాంట్రాక్టర్లకు, ధర్మప్రచారాలకే వినియోగిస్తున్నారని రమణ దీక్షితులు విమర్శలు చేశారు. స్వామివారి సేవ కోసం ఇచ్చిన విరాళాలను ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించడం క్షేమదాయకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే భక్తులు కూడా డబ్బులు హుండీల్లో వేయకుండా అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళంగా అందజేస్తే పుణ్యం వస్తుందని సూచించారు.