AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్యలో రామాలయం ఉండేదట

అయోధ్యలో క్రీ.పూ. రెండో శతాబ్దంలో అతి పెద్ద రామాలయం ఉండేదని.. ‘ అయోధ్య వివాదం ‘ లో ఓ భాగమైన రామ్ లాలా విరాజ్ మాన్ తరఫు లాయర్ సీ.ఎస్. వైద్యనాథన్… సుప్రీంకోర్టుకు తెలిపారు. 1500 ప్రాంతంలో అక్కడే.. ఆ వివాదాస్పద స్థలంలోనే.. మొఘల్ పాలకులు బాబరీ మసీదును నిర్మించారని ఆయన చెప్పారు. అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు వరుసగా రోజువారీ విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఏడో రోజైన శుక్రవారం వైద్యనాథన్ ఈ విషయం […]

అయోధ్యలో రామాలయం ఉండేదట
Pardhasaradhi Peri
|

Updated on: Aug 17, 2019 | 2:23 PM

Share

అయోధ్యలో క్రీ.పూ. రెండో శతాబ్దంలో అతి పెద్ద రామాలయం ఉండేదని.. ‘ అయోధ్య వివాదం ‘ లో ఓ భాగమైన రామ్ లాలా విరాజ్ మాన్ తరఫు లాయర్ సీ.ఎస్. వైద్యనాథన్… సుప్రీంకోర్టుకు తెలిపారు. 1500 ప్రాంతంలో అక్కడే.. ఆ వివాదాస్పద స్థలంలోనే.. మొఘల్ పాలకులు బాబరీ మసీదును నిర్మించారని ఆయన చెప్పారు. అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు వరుసగా రోజువారీ విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఏడో రోజైన శుక్రవారం వైద్యనాథన్ ఈ విషయం వెల్లడించారు. 1950 లో ఈ స్థలాన్ని తనిఖీ చేయాలని అప్పటి కోర్టు ఓ కమిషనర్ ని నియమించిందని, ఆ కమిషనర్ తన నివేదికలో ఈ అంశాన్ని పేర్కొన్నారని ఆయన తెలిపారు. భారత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల ఆధారంగా తానీ విషయాన్ని తెలియజేస్తున్నానని ఆ కమిషనర్ రిపోర్టులో వెల్లడించారు. పురావస్తు తవ్వకాల్లో ఓ పెద్ద ఆలయం బయటపడిందని, ఆ స్పాట్ లో కృష్ణ, శివతాండవ, చిత్రాలతో కూడిన పలు స్తంభాలు, రాముడి చిన్నతనపు ఇమేజీ, సింహాల మధ్య గరుడునితో కూడిన విగ్రహాలు కనిపించాయి అని ఆ నివేదిక వివరించిందని వైద్యనాథన్ తెలిపారు. ఇస్లామిక్ సిధ్ధాంతాలకు, ఈ విగ్రహాలకు మధ్య అసలు పోలిక ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి విగ్రహాలు ముస్లిముల పోకడకు పూర్తిగా విరుధ్దమైనవని అన్నారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య అంశంమీద విచారణ జరుపుతోంది. మొదట్లో ఇది రహస్య విచారణ అని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తరువాత మీడియాకు ఈ విచారణ తాలూకు అంశాలను అందిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ తమ వాదనలను కోర్టులో వినిపిస్తోంది.

Follow Us
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
గుండెపోటుకు చెక్ పెట్టే గుప్పెడు పల్లీలు..ఆ తీవ్రమైన సమస్యకు ఔషధం
గుండెపోటుకు చెక్ పెట్టే గుప్పెడు పల్లీలు..ఆ తీవ్రమైన సమస్యకు ఔషధం
కూరలో ఉప్పు ఎక్కువైందా..? చిటికెలో సెట్ చేసే అద్భుతమైన చిట్కాలు..
కూరలో ఉప్పు ఎక్కువైందా..? చిటికెలో సెట్ చేసే అద్భుతమైన చిట్కాలు..
ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే..పట్టింది బంగారమే
ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే..పట్టింది బంగారమే
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ మూవీ ఎలా ఉందంటే?
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ మూవీ ఎలా ఉందంటే?
తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం
తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం