Red Movie Trailer: ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తదం’కు ఇది రీమేక్. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. నివేదా పేతురాజ్, అమ్రితా అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సంక్రాంతి పండక్కి ‘రెడ్’తో థియేటర్లలోకి రానున్నారని వెల్లడించారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, ‘రెడ్’కి కూడా అద్భుత పాటలను సమకూర్చారు. కాగా, ఈ నెల 24న ‘రెడ్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు.
The wait has been long but now we are back with a bang!
Ustaad @ramsayz‘s #RedTrailer on DECEMBER 24 ??https://t.co/e4Hy5UmKlG#RedTheFilm #RAPO @Nivetha_Tweets @Malvika_Sharma_ @Actor_Amritha #TirumalaKishore #SravanthiRaviKishore #Manisharma @LahariMusic @sravanthimovies pic.twitter.com/RQayvqBhtH
— BARaju (@baraju_SuperHit) December 21, 2020