రామజన్మభూమి ట్రస్ట్‌ సారథికి కొవిడ్ పాజిటివ్‌

|

Aug 13, 2020 | 1:57 PM

రామజన్మభూమి ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర...

రామజన్మభూమి ట్రస్ట్‌ సారథికి కొవిడ్ పాజిటివ్‌
Follow us on

Nitya Gopaldas Tested Corona Positive : రామజన్మభూమి ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

మెదాంతకు చెందిన డాక్టర్ త్రెహన్‌తో సీఎం యోగి ఫోన్‌లో మాట్లాడారు. నృత్య గోపాల్ దాస్‌కు మెరుగైన‌ వైద్య సదుపాయాలు అందించాల‌ని జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు వైద్యులను ఆయన ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రస్తుతం కృష్ణజన్మాష్టమి సందర్భంగా నృత్యగోపాల్‌ దాస్‌ మథురలో ఉన్నారు. అక్కడే ఆయనకు శ్వాసకోస సమస్యలు ఏర్పడటంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్యగోపాల్‌దాస్‌కు కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది.

ఈ మధ్యే అయోధ్యలో జరిగిన మందిర భూమిపూజ కార్యక్రమాలను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాముడి గుడి భూమి పూజ వేదికను పంచుకున్నారు. వైదికపై ఉన్న ఐదుగురు ప్రముఖుల్లో నృత్యగోపాల్‌దాస్‌ ఒకరు.

అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో భాగంగా మోదీతోపాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌ వేదికపై పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందే, మందిర పూజారి ప్రదీప్‌దాస్‌తో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే.