ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలుస్తాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొన్నటికి మొన్న చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విజయవాడలో ఏర్పాటు చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వేడుకలో సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సందర్భాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇవి ఎవరు చేశారో తెలుసా అంటూ ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్‌పై ఇలాంటి పోస్ట్ పెట్టినందుకు ఆయన అభిమానులు వర్మపై కామెంట్స్ రూపంలో తిట్ల వర్షం కురిపిస్తున్నారు.
Who said all this? Just asking pic.twitter.com/XnZAz6PX8w
— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2019