వైల్డ్ లైఫ్‌లోకి రామ్ చరణ్.. కొత్త పాత్రలో సామాజిక కోణం

|

Dec 19, 2019 | 6:13 PM

మెగా పవర్ స్టార్‌గా సుపరిచితులైన చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ కొత్త అవతారం ఎత్తారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా ఆయన తనదైన స్టైల్‌తో కొత్త బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పటి దాకా కెమెరా ముందు కనిపించే రామ్ చరణ్ ఇప్పుడు కెమెరా చేత వన్య ప్రాణులను చిత్రీకరించే పనిలో పడ్డారు. అది కూడా ఓ సామాజిక బాధ్యతగా చేపట్టారు రామ్ చరణ్. కెమెరా ముందు హీరోయిజం ప్రదర్శించే రామ్ చరణ్‌కు సడన్‌గా కెమెరా చేతబట్టి ఫోటోగ్రాఫర్‌గా […]

వైల్డ్ లైఫ్‌లోకి రామ్ చరణ్.. కొత్త పాత్రలో సామాజిక కోణం
Follow us on

మెగా పవర్ స్టార్‌గా సుపరిచితులైన చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ కొత్త అవతారం ఎత్తారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా ఆయన తనదైన స్టైల్‌తో కొత్త బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పటి దాకా కెమెరా ముందు కనిపించే రామ్ చరణ్ ఇప్పుడు కెమెరా చేత వన్య ప్రాణులను చిత్రీకరించే పనిలో పడ్డారు. అది కూడా ఓ సామాజిక బాధ్యతగా చేపట్టారు రామ్ చరణ్.

కెమెరా ముందు హీరోయిజం ప్రదర్శించే రామ్ చరణ్‌కు సడన్‌గా కెమెరా చేతబట్టి ఫోటోగ్రాఫర్‌గా మారాలని ఎందుకు అనిపించింది? అందుకు ఎవరు కారణం ? ఇపుడు టాలీవుడ్‌లో ఈ రకమైన చర్చ మొదలైంది. నిజంగా ఫోటోగ్రాఫర్ పాత్ర రామ్ చరణ్‌కు కొత్తే. ప్రొఫెషనల్ కెమెరా చేతబట్టి, వన్యప్రాణులను పిక్చరైజ్ చేయడమంటే మాటలు కాదు. దానికి ఎంతో ధైర్యం కావాలి. ఏదో ఎన్.జి.సి. ఛానల్లోనో చూసినట్లు వన్యప్రాణుల మధ్య తిరిగే ఫోటోగ్రాఫర్ పాత్ర సినిమాల్లో చేసేందుకే జంకుతారు. అలాంటిది నిజజీవితంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా మారారు రామ్ చరణ్.

వన్యప్రాణుల సంరక్షణ కోసం ఆయన నిజజీవితంలో చేపట్టిన కొత్త పాత్ర ఇది. వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రపంచస్థాయిలో చేపట్టే నిధుల సమీకరణలో రామ్ చరణ్ కూడా పాలుపంచుకోనున్నారు. ఆయన కొత్తగా నిర్మించిన ఇంట్లో ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఇందులో సింహాలు, చిరుతపులులు, జిరాఫీలు తదితర వన్యప్రాణుల ఫొటోలను కూడా ఏర్పాటుచేశారు. ఈ ఫొటోలు తీయడంలో రామ్ చరణ్‌తోపాటు షాజ్ జంగ్, ఇజాజ్ ఖాన్, ఇషేతా సాల్గావ్కర్‌ కూడా ఫొటోగ్రాఫర్లుగా పనిచేశారు.

ఈ ఫొటో ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్య పర్చడమే రామ్ చరణ్ బృందం ఉద్దేశమని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒక విధంగా ఇది రామ్ చరణ్ చేసే స్వచ్ఛంద సేవ అని వారంటున్నారు. ఈ భూమిని, ప్రకృతిని కాపాడటం కోసం డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. అనే స్వచ్ఛంద సంస్థ గత 60 ఏళ్లుగా పనిచేస్తోంది. అంతర్జాతీయంగా యాభై లక్షల మంది సభ్యులతో 100 దేశాలలో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పర్యావరణ మార్పుల కారణంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న తూర్పు కనుమల్లో అనేక వృక్షజాతులు, పక్షులు, కీటకాలకు రక్షణ లేకుండా పోయింది. కృత్రిమ వనరుల కల్పనతోనైనా వీటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై రామ్ చరణ్ బృందం దృష్టిపెట్టారు.

మన భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందంటున్నారు రామ్ చరణ్. ‘‘ప్రకృతిలోకి నేను కెమెరాతో ప్రయాణించడానికి కారణం ఇదే. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా’‘ అన్నారు రామ్ చరణ్. ఆయన ఈ కార్యక్రమానికి పూనుకోడానికి కారణం ఆయన జీవిత భాగస్వామి ఉపాసన కొణిదెల. ఈ బృహత్తర కార్యకలాపాలు నిర్వహిస్తున్న డబ్ల్యు,డబ్ల్యు.ఎప్. సంస్థకు ఆమె రాయబారిగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ కెమెరా వెనకున్న శక్తి ఉపాసనే అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.