చంద్రబాబు ఈకలు పీకుతున్నారు.. కొడాలి ఖతర్నాక్ కామెంట్

రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ ఏపీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వర రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులుంటే బావుంటుందని, బహుశా అలా ఏర్పాటు కావచ్చని ముఖ్యమంత్రి జగన్ అంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం పార్టీలో కూలంకషంగా చర్చించకుండా ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారని కొడాలి నాని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు నివేదికలిచ్చాకనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చాలా క్లియర్‌గా చెప్పారని, సీఎం మాటలు […]

చంద్రబాబు ఈకలు పీకుతున్నారు.. కొడాలి ఖతర్నాక్ కామెంట్
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 19, 2019 | 5:11 PM

రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ ఏపీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వర రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులుంటే బావుంటుందని, బహుశా అలా ఏర్పాటు కావచ్చని ముఖ్యమంత్రి జగన్ అంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం పార్టీలో కూలంకషంగా చర్చించకుండా ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారని కొడాలి నాని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు నివేదికలిచ్చాకనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చాలా క్లియర్‌గా చెప్పారని, సీఎం మాటలు సరిగ్గా వినకుండానే చంద్రబాబు గొడవ మొదలు పెట్టారని నాని ఆరోపించారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఆరు నెలలుగా రాయలసీమ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, గ్రౌండ్ లెవెల్‌లో వున్న పరిస్థితిని బట్టి, ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెబుతున్నారని నాని వివరించారు. కొందరు టీడీపీ నాయకులు కూడా సీఎం ప్రకటనను స్వాగతిస్తుంటే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని అన్నారాయన. చంద్రబాబు చెప్పినట్లు పవన్ కల్యాణ్ నడుచుకుంటున్నారని విమర్శించారు నాని.

రాజధానిపై స్పష్టమైన ప్రకటన వచ్చే రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి కోరారు. చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారని, వారెవరు ఆయన బుట్టలో పడొద్దని నాని సూచించారు. దేశ రాజధాని ఉత్తరాదిన వుంది… అలాగని మనందరం ఢిల్లీకి వెళ్ళడం లేదా అని ప్రశ్నించారు కొడాలి నాని. సీఎం జగన్ చేసిన ప్రకటనకు తాను ఓ క‌ృష్ణా జిల్లావాసిగా పూర్తిగా మద్దతునిస్తున్నానని నాని అన్నారు. దేశంలో పది రాష్ట్రాల్లో రాజధాని, హై కోర్టు వేరువేరు నగరాల్లో వున్నాయన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని నాని చెబుతున్నారు.