యంగ్ టీమ్ రూపొందించిన రాజావారు రాణివారు టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బావరమ్, రహస్య గోరక్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మించారు. టీజర్‌లో.. ఒక పల్లెటూరు. అందులో ఒక ప్రేమ కథ. పాత కాలంలో ఒక రిక్షా పైన వెళ్తూ మైక్‌లో సినిమా ప్రచారం చేసేవారు. ఆ స్టైల్‌లో ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. నూతన నటీనటులు సాంకేతిక నిపుణులచే తీర్చిదిద్దినటువంటి ఈ సినిమా పరిచయం కూడా బుర్రకథా పారాయణం అంటూ బుర్రకథ స్టైల్‌లో ఒక్కో పాత్రను పరిచయం చేశారు.