మైనర్ బాలికపై 30 మంది మృగాళ్ల అఘాయిత్యం.. బుల్డోజర్ యాక్షన్ షురూ.. 4 హోటళ్లు నేలమట్టం!
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ఒళ్ళు గగుర్పొడిచే అత్యంత అమానవీయ ఘటన వెలుగుచూసింది. కేవలం 13 ఏళ్ల మైనర్ బాలికపై ఐదు రోజుల పాటు 30 మందికి పైగా కామాంధులు పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఈ దారుణానికి సహకరించిన, అండగా నిలిచిన పలు హోటళ్లపై జిల్లా యంత్రాంగం, పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి బుల్డోజర్లను మోహరించి, ఈ దారుణంతో సంబంధం ఉన్న నాలుగు హోటళ్లను నేలమట్టం చేశారు. నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హరిశంకర్ స్పష్టం చేశారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. జూన్ 18న సదరు బాలిక తన ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఒక దుర్మార్గుడైన రిక్షా కార్మికుడు ఆ పసిపిల్లను అపహరించి, నగరంలోని ఒక హోటల్ యజమానికి విక్రయించాడు. అక్కడి నుండి ఐదు రోజుల పాటు నగరంలోని వివిధ హోటళ్లకు ఆ బాలికను తిప్పుతూ సుమారు 30 మందికి పైగా పురుషులు ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. పదేపదే జరిగిన ఈ దాడుల వల్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం సేవించేలా చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ ఘోరమైన లైంగిక వేధింపులలో పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులు ప్రత్యక్షంగా పాలుపంచుకోవడమే కాకుండా, ఈ నేరాన్ని పూర్తిగా అణచివేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను, అనుమానితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితులకు, వారికి సహకరించిన హోటల్ యాజమాన్యాలకు మరణశిక్ష విధించాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘోరాన్ని నివారించడంలో శాంతిభద్రతలను కాపాడటంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దోషులందరినీ కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..