Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలను ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. తాజగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతవరణ కేంద్రాలు శుక్రవారం ప్రకటనలు విడుదల చేశాయి.
మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా తమిళనాడు వరకు ఆవర్తనం ఏర్పడి ఉంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు పేర్కొన్నాయి. రేపు, ఎల్లుండి దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపాయి.
కాగా.. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో పలు చోట్ల పంటలు నాశనమయ్యాయి. పిడుగుపాటు ఘటనల కారణంగా ఎడెనిమిది మంది వరకు మరణించారు. ఒక వైపు వర్షాలు కురవడంతోపాటు.. ఎండలు విపరీతంగా వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
Also Read: