AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అనుబంధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతంలో రెండు తెలుగురాష్ట్రాల్లో బుధవారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పస్టం చేసింది. అలాగే పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Ap Andtelangana Weather Update
Anand T
|

Updated on: Jul 22, 2026 | 8:10 AM

Share

ఈ సారి నైరుతి రుపువణాలు బలహీనంగా ఉండడంతో వర్షాకాలం స్టార్ట్ అయిన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురువలేదు. దీంతో వర్షాల కోసం అటు రైతన్నలను ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఇటు సాధారణ ప్రజలకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ గత రెండ్రోజులుగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి అటు ఏపీ విపత్తు నిర్వహన స్థంస్థ, ఇటు హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర ఆయా రాష్ట్రాలకు వర్ష సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అనుబంధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతంలో రెండు తెలుగురాష్ట్రాల్లో బుధవారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో వర్షాలు

బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలుల కూడా వీస్తాయని తెలిపింది.ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగులో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే రాబోయే 24 గంటల్లో మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ స్పస్టం చేసింది.

ఏపీలో వర్షాలు ఇలా

ఇక అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు సైతం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వర్ష సూచనలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల, పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే