భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం.. 109 రూట్లలో ఇక ప్రైవేట్ రైళ్ల పరుగులు..!

భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్లానింగ్స్ బుధవారం అఫిషియ‌ల్ గా వెలువ‌రించింది. ఈ మేరకు 109 రూట్ల‌లో 151 మోడ‌ర‌న్ ట్రైన్స్ రాకపోకల కోసం ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆహ్వానించినట్టు అనౌన్స్ చేసింది. ఈ మేరకు 109 రూట్ల‌లో ప్యాసింజర్​ రైళ్ల రాకపోకల కోసం రిక్వెస్ట్​ ఆఫ్​ క్వాలిఫికేషన్​ ను ఇవ్వాల‌ని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేలో ప్రైవేటు కంపెనీలు రూ.30వేల కోట్లకుపైగా ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టనున్నట్టు […]

భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం.. 109 రూట్లలో ఇక ప్రైవేట్ రైళ్ల పరుగులు..!
Follow us

|

Updated on: Jul 01, 2020 | 10:19 PM

భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్లానింగ్స్ బుధవారం అఫిషియ‌ల్ గా వెలువ‌రించింది. ఈ మేరకు 109 రూట్ల‌లో 151 మోడ‌ర‌న్ ట్రైన్స్ రాకపోకల కోసం ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆహ్వానించినట్టు అనౌన్స్ చేసింది. ఈ మేరకు 109 రూట్ల‌లో ప్యాసింజర్​ రైళ్ల రాకపోకల కోసం రిక్వెస్ట్​ ఆఫ్​ క్వాలిఫికేషన్​ ను ఇవ్వాల‌ని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేలో ప్రైవేటు కంపెనీలు రూ.30వేల కోట్లకుపైగా ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టనున్నట్టు తెలిపింది.

అయితే ఎంపిక చేసిన ప్రైవేటు సంస్థలే.. రైళ్ల ఆర్థిక, నిర్వహణ ఖర్చులు భరించాలని భారతీయ రైల్వే స్పష్టం చేసింది . వీటితో పాటు రైళ్లను నడపడానికి అవసరమయ్యే విద్యుత్ ఛార్జీలు,​ వాణిజ్య ఛార్జీలు, ఇంధనం వంటి ఖ‌ర్చుల‌ను కూడా ప్రైవేటు సంస్థలే చెల్లించాలని వివ‌రించింది.