Prabhas Movie: ప్రభాస్ సినిమా ముందే రానుందా..? రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ ఎప్పుడంటే..?

| Edited By:

Dec 30, 2020 | 5:32 AM

ప్రభాస్ సాహో తర్వాత నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. అయితే ఈ సినిమా విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Prabhas Movie: ప్రభాస్ సినిమా ముందే రానుందా..? రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ ఎప్పుడంటే..?
Follow us on

ప్రభాస్ సాహో తర్వాత నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. అయితే ఈ సినిమా విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మూవీ రిలీజ్ 2021 ద్వితీయార్ధంలో ఉంటుందంటుంటే… మరికొందరు మాత్రం 2021 సమ్మర్‌కు మందే సందడి చేస్తుందని అంటున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అంతే స్థాయిలో విడుదల కానుంది. కాగా ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాధేశ్యామ్ విడుదలను ముందుకు జరిపారంటా…. మార్చి 30న ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు. కాగా జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు.