లాక్‌డౌన్ సడలింపుల‌తో చోరీలు పెరిగాయి : మహేష్ భగవత్

|

Aug 28, 2020 | 4:26 PM

లాక్‌డౌన్ సడలింపుల‌తో మళ్ళీ చోరీలు పెరిగాయ‌ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇటీవ‌ల మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన చోరి గురించిన వివ‌రాల‌ను ఆయ‌న‌కు మీడియాకు వెల్ల‌డించారు.

లాక్‌డౌన్ సడలింపుల‌తో చోరీలు పెరిగాయి : మహేష్ భగవత్
Follow us on

లాక్‌డౌన్ సడలింపుల‌తో మళ్ళీ చోరీలు పెరిగాయ‌ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇటీవ‌ల మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన చోరి గురించిన వివ‌రాల‌ను ఆయ‌న‌ మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో ఇద్దరు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశామ‌ని, మధ్య ప్రదేశ్‌కి చెందిన రితురాజ్ సింగ్ ఈ చోరీలో ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. 2016 మధ్య ప్రదేశ్‌లో ఓ హత్య కేసులో కూడా రితురాజ్ నిందితుడని వెల్ల‌డించారు. ఆ కేసులో జైలు నుంచి విడుదల అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రసాద్ సేన్ అనే వ్య‌క్తితో కలిసి చోరీలు చేస్తున్నాట్లు చెప్పారు.

రెక్కీ నిర్వహించి శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలకు పాల్ప‌డ్డార‌ని తెలిపారు. వీరి వద్ద నుండి 26 తులాల బంగారు ఆభరణాలు, 2.5కేజీల వెండి , రూ.1.80 లక్షల నగదు, 2 ద్విచక్రవాహనాలు, ఒక లాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్న‌ట్లు వివ‌రించారు. వీరిపై గతంలో పలు పోలీసు స్టేషన్లలో కేసులు గుర్తించారు పోలీసులు. గతంలో రితురాజ్ నగరంలో బైక్‌ల‌ చోరీ కేసులో అరెస్ట్ అయిన‌ట్లు తెలిపారు.

Also Read :

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు

 బెజ‌వాడ‌లో ఇద్ద‌రు రౌడీ షీట‌ర్లు అరెస్ట్, మార‌ణాయుధాలు స్వాధీనం

చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కస్టడీ పూర్తి