దోమలపెంటలో కొండచిలువ హల్‌చల్…

నాగర్‌కర్నూలు జిల్లాలో కొండచిలువ హల్‌చల్‌ చేసింది. దోమలపెంటలోని ప్రభుత్వ పాఠశాలలోకి దూరిన కొండచిలువను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

దోమలపెంటలో కొండచిలువ హల్‌చల్...

Edited By:

Updated on: Aug 29, 2020 | 7:06 PM

Python In Domalapenta: నాగర్‌కర్నూలు జిల్లాలో కొండచిలువ హల్‌చల్‌ చేసింది. దోమలపెంటలోని ప్రభుత్వ పాఠశాలలోకి దూరిన కొండచిలువను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దీనితో వారు స్నేక్‌ క్యాచర్ ను పిలవగా.. ‌దాహుద్‌ అనే స్నేక్ క్యాచర్ అక్కడికి వచ్చి దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అచ్చంపేట ఫారెస్టు ఆఫీసర్‌ కిష్టగౌడ్‌ దోమలపెంటకు చేరుకుని కొండచిలువను బంధించారు. తమ గ్రామం శ్రీశైలం ఫారెస్టు ఆనుకుని ఉండటంతో తరచూ విషసర్పాలతోపాటు కొండచిలువలు కూడా వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. పాముల నుండి తమను కాపాడాలని గ్రామస్తులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కొండచిలువను దట్టమైన అడవిలో వదిలిపెట్టారు. (తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..)