AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 42 కోట్ల విలువైన 504 గోల్డ్ బార్స్ ని పట్టేశారు

ఢిల్లీరైల్వే స్టేషన్లో భారీగా స్మగుల్డ్ గోల్డ్ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ ) అధికారులు చాకచక్యంగా నిఘా వేసి రూ. 42 కోట్ల విలువైన 504 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో..

రూ. 42 కోట్ల విలువైన  504 గోల్డ్ బార్స్ ని పట్టేశారు
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 29, 2020 | 7:10 PM

Share

ఢిల్లీరైల్వే స్టేషన్లో భారీగా స్మగుల్డ్ గోల్డ్ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ ) అధికారులు చాకచక్యంగా నిఘా వేసి రూ. 42 కోట్ల విలువైన 504 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో 8 మందిని అరెస్టు చేశారు. ఈ బంగారు దొంగరవాణా నిగ్గు తేల్చేందుకు అధికారులు సుమారు నెలరోజులపాటు నిఘా పెట్టినట్టు తెలిసింది. నిన్న డిబ్రుగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు నుంచి దిగిన ఈ ఎనిమిది మందీ ఈ పుత్తడిని ఢిల్లీ, ముంబై, కోల్ కతా వంటి నగరాల్లో స్మగుల్ చేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం. ఈ కేటుగాళ్లు ప్రత్యేకంగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేట్టు కుట్టించుకున్న దుస్తుల్లో ఈ బంగారు కడ్డీలను దాచినట్టు అధికారులు తెలిపారు. వీళ్ళు ఫేక్ ఆధార్ కార్డుతో ప్రయాణిస్తున్నారట.

మ్యాన్ మార్ నుంచి ఇండియాలోకి ఈ స్వర్ణాన్ని స్మగుల్ చేయబోయారని, మణిపూర్ లోని మోరేద్వారా ఇదంతా సాగుతోందని తెలిసింది. గౌహతి నుంచి ఈ స్మగ్లింగ్ సిండికేట్ తన కార్యకలాపాలను సాగిస్తున్నట్టు వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న మేలిమి బంగారంపై విదేశీ మార్కింగ్స్ ఉన్నాయని, మొత్తం 82 కిలోలకు పైగా బరువు ఉన్నాయని సిబ్బంది చెప్పారు. అసలు దీని మార్కెట్ విలువ రూ. 43 కోట్లని కూడా వారు తెలిపారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే