రూ. 9.66 కోట్ల హవాలా నగదు స్వాధీనం.. ఆరుగురి అరెస్టు

పంజాబ్‌ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఎన్నికల దృష్ట్యా పంజాబ్‌‌లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలలో పెద్ద మొత్తంలో హవాలా డబ్బు దొరికింది. ఖన్నా నగర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న మూడు వాహనాలను తనిఖీ చేశారు. ఈ మూడు వాహనాల్లో మొత్తం 9 కోట్ల 66లక్షల 61వేల700 రూపాయిల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఖన్నా నగర […]

రూ. 9.66 కోట్ల హవాలా నగదు స్వాధీనం.. ఆరుగురి అరెస్టు

Edited By:

Updated on: Mar 30, 2019 | 4:12 PM

పంజాబ్‌ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఎన్నికల దృష్ట్యా పంజాబ్‌‌లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలలో పెద్ద మొత్తంలో హవాలా డబ్బు దొరికింది. ఖన్నా నగర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న మూడు వాహనాలను తనిఖీ చేశారు. ఈ మూడు వాహనాల్లో మొత్తం 9 కోట్ల 66లక్షల 61వేల700 రూపాయిల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఖన్నా నగర పోలీస్ ఉన్నతాధికారి ధృవ్‌ దహియా తెలిపారు. కాగా నగదుకు సంబంధించి ఏలాంటి పత్రాలు లేకపోవడంతో.. డబ్బును ఐటీ అధికారులకు అప్పజెప్పారు.