నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 రెండు వారాలు కంప్లీట్ చేసుకుని రేటింగ్‌లో దూసుకుపోతోంది. మొదటి వారంలో హేమ ఎలిమినేట్ అవ్వగా.. తమన్నా వైల్ కార్ట్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండవ వారంలో జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం ఎపిసోడ్ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే రచ్చ మొదలైంది. ఈ సారి నామినేషన్లు కాస్త డిఫరెంట్‌గా చేస్తుండగా.. పునర్నవి తనకు తాను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటున్నానని ప్రకటించడంతో.. బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తం పునర్నవిని నామినేషన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నాను ఇప్పుడు టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంట్లోని సభ్యులందరూ ఆమెను టార్గెట్ చేయడం.. ఆమె సీరియస్ గా వాళ్లందరికీ వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే తమన్నాను సెంటర్ పాయింట్ చేశారని అనిపిస్తోంది. అయితే ఇది వరకే తమన్నాకు, అలీకి మధ్య గొడవ జరిగింది. అప్పుడు కూడా ఇంటి సభ్యులు అందరూ అలీకే సపోర్టు చేశారు. మరి ఈ వారం ఎలిమినేషన్‌లో ఎవరు బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళతారో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.