దేశ ప్రధానికే బెదిరింపులు.. సోషల్ ‌మీడియాలో ఆఫర్ ఇచ్చిన మలయాళీ.. చివరకు..

Puducherry Man Arrested: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. అలాగే ఓ వ్యక్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే చంపుతానని..

దేశ ప్రధానికే బెదిరింపులు.. సోషల్ ‌మీడియాలో ఆఫర్ ఇచ్చిన మలయాళీ.. చివరకు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 05, 2021 | 6:41 PM

Puducherry Man Arrested: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. అలాగే ఓ వ్యక్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే చంపుతానని.. దీనికి ఐదు కోట్ల డబ్బులివ్వాలని సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించాడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. పుదుచ్చేరిలోని ఆర్యన్‌కుప్పం గ్రామానికి చెందిన సత్యానందం (43) అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.. తనకు రూ.5కోట్లు ఇస్తే ప్రధాని మోదీని చంపుతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిని ఓ ట్యాక్సి డ్రైవర్‌ గుర్తించి గురువారం పోలీసులకు సమాచారం అందించాడు.

అనంతరం సత్యానందం ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ట్రేస్‌ చేసిన పోలీసులు పుదుచ్చేరికి సమీపంలో శుక్రవారం అతన్ని పట్టుకొని విచారిస్తున్నారు. అయితే అంతకుముందు సత్యానందం రెచ్చగొట్టెవిధంగా పలు మతాలు, రాజకీయ నాయకులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన తరువాత సత్యానందంను స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ప్రజల మధ్య అల్లర్లు సృష్టించడం, శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలపై ఐపీసీ సెక్షన్లు 505(1), 505(2) కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Fire Accident: ముంబైలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం..

Rajya Sabha: అలాంటి వారిపై దేశ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు.. దీప్ సిధుని ఎందుకు అరెస్ట్ చేయలేదు: సంజయ్ రౌత్