Rajya Sabha: అలాంటి వారిపై దేశ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు.. దీప్ సిధుని ఎందుకు అరెస్ట్ చేయలేదు: సంజయ్ రౌత్
Shiv Sena MP Sanjay Raut: నిజాలు మాట్లాడి హక్కుల కోసం పోరాడే వారిపై బీజేపీ ప్రభుత్వ పాలకులు దేశద్రోహిగా, దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై..
Shiv Sena MP Sanjay Raut: నిజాలు మాట్లాడి హక్కుల కోసం పోరాడే వారిపై బీజేపీ ప్రభుత్వ పాలకులు దేశద్రోహిగా, దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు ఉద్యమం చేస్తున్న రైతులు, వారి కోసం పోరాడుతున్న వారిని ఖలిస్తానీలుగా, దేశ వ్యతిరేకులుగా పేర్కొనడం తగదంటూ సూచించారు. ఆందోళన చేస్తున్న వ్యక్తులపై తప్పుడు కేసులు నమోదు చేయడంపై సంజయ్ రౌత్ రాజ్యసభలో శుక్రవారం మాట్లాడారు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన విధ్వంసానికి ప్రధాన కారకుడైన దీప్ సిద్ధూని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విధ్వంసంతో సంబంధం లేని వారిపై కేసులు పెట్టి, ప్రధాని నిందితుడిని వదిలేశారంటూ నిలదీశారు.
దీంతోపాటు అర్నాబ్ గోస్వామి.. బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా వాట్సప్ చాట్ గురించి ప్రస్తావిస్తూ బాలకోట్ దాడి గురించి ముందే ఎలా తెలుస్తుందంటూ సంజయ్ రౌత్ ప్రస్తావించారు. వివరాలను లీక్ చేయడమంటే దేశ రహస్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని.. కానీ వారికి ప్రభుత్వం ఆశ్రయమిస్తుందంటూ ఆరోపించారు. అర్నాబ్ గోస్వామి, కంగనా రనౌత్ వంటి వారిని మోడీ ప్రభుత్వం దేశభక్తులుగా చూస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ హింసలో 200మందిని అరెస్టు చేశారని.. 100మందికి పైగా తప్పిపోయారని దీనిపై స్పందించాలని కోరారు.
Also Read: