నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ45

| Edited By:

Apr 01, 2019 | 10:46 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లాలోని స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ సీ-45 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 27గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9.27గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వాహనం ద్వారా డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌ను అంతరిక్షంలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన మరో 28 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో […]

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ45
Follow us on

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లాలోని స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ సీ-45 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 27గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9.27గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వాహనం ద్వారా డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌ను అంతరిక్షంలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన మరో 28 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు.

ప్రాథమికంగా ఈ ప్రయోగం విజయవంతం అయినట్టు తెలుస్తున్నా, ఉపగ్రహాలన్నీ నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశించడానికి మరికొంత సమయం పట్టనుంది. అయితే ఒకే ప్రయోగంలో మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి. కాగా 436 కేజీల బరువు గల ఇమిశాట్ ఉపగ్రహం రక్షణశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహం వలన శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.