Professional Social Network LinkedIn: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని ప్రముఖ ప్రొఫెషనల్ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ లింక్డ్‌ఇన్ నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా 960 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ను ప్రకటించింది. కంపెనీలో మరింత సిబ్బందిని తొలగించే ఉద్దేశం లేదని మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని లింక్డ్‌ఇన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ర్యాన్ రాస్‌ల్యాన్‌స్కై పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల మంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాయం చేస్తామని కంపెనీ నిర్ణయించింది.
Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..