రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన సీఎం కార్యాలయ ఓఎస్డి ప్రియాంక వర్గీస్ దూలపల్లి లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమం 23 శాతం నుండి 33 శాతానికి అడవులు పెంచాలన్న లక్ష్యంతో నడుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఈ లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకుంటుందని, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దీనికి తోడు అవుతుందని వివరించారు. ఈ ఛాలెంజ్ వలన ప్రజలలో చైతన్యం కలుగుతుందని తెలిపారు.
Thank you #PriyankaVarghese IFS garu for accepting #GreenIndiaChallenge and planting saplings. Your efforts in making #Telangana ku #HarithaHaaram, the brain child of our Honble CM #KCR garu, known to all. Your participation in #GIC would certainly boost up the initiative. pic.twitter.com/NErGmEAoRO
— Santosh Kumar J (@MPsantoshtrs) October 16, 2020