గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గర అదుపు తప్పి ప్రవేటు బస్సు బోల్తా పడింది. బస్సు చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సీటులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులను అద్దాలు పగులగొట్టి పోలీసులు కాపాడారు. గాయాపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. వాతావరణ పరిస్థితులు, డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.