కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

| Edited By:

Mar 08, 2019 | 3:46 PM

ఉత్తరప్రదేశ్ : కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఉదయం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ లక్నో తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి చేరుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆ రాష్ట్ర గవర్నర్ రాం నాయక్, సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయల్దేరిన ప్రధాని కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకున్నారు. 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి […]

కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
Follow us on

ఉత్తరప్రదేశ్ : కాశీ విశ్వనాథ్ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఉదయం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ లక్నో తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి చేరుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆ రాష్ట్ర గవర్నర్ రాం నాయక్, సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయల్దేరిన ప్రధాని కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకున్నారు. 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయం పేరు మీదుగా ఐదు ఇటుకలు పేర్చి పనులను ప్రారంభించారు. మొత్తం నాలుగు దశల్లో ఆలయ అభివృద్ధిని చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయం మరింత శోభాయమానంగా మారనుంది. ప్రాజెక్టు సైట్‌ను పరిశీలించిన ప్రధాని… అక్కడి దీన్ దయాళ్ హస్తకళా సంకుల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా జీవన విధాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. గవర్నర్, సీఎంతో పాటు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని కాశీ విశ్వేశ్వరుడి పూజలో పాల్గొన్నారు.