పంజాబ్ సీఎంతో భేటీకి రాష్ట్రపతి తిరస్కరణ

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిరసనకు యోచిస్తున్నారు. తొలుత ఈ చట్టాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశమయ్యేందుకు అమరేందర్ సింగ్ అపాయింట్ మెంట్ కోరగా ఆయన  తిరస్కరించారు. అమరేందర్ వెంట పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాగా- రైతు చట్టాలను నిరసిస్తూ పంజాబ్ లో ఆందోళనకారులు రైల్ రోకో ఆందోళన చేపట్టడంతో కేంద్రం ఆ రాష్ట్రానికి రైలు సర్వీసులను నిలిపివేసింది.  దీంతో నిత్యావసర […]

పంజాబ్ సీఎంతో భేటీకి రాష్ట్రపతి తిరస్కరణ

Edited By:

Updated on: Nov 03, 2020 | 8:15 PM

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిరసనకు యోచిస్తున్నారు. తొలుత ఈ చట్టాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశమయ్యేందుకు అమరేందర్ సింగ్ అపాయింట్ మెంట్ కోరగా ఆయన  తిరస్కరించారు. అమరేందర్ వెంట పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాగా- రైతు చట్టాలను నిరసిస్తూ పంజాబ్ లో ఆందోళనకారులు రైల్ రోకో ఆందోళన చేపట్టడంతో కేంద్రం ఆ రాష్ట్రానికి రైలు సర్వీసులను నిలిపివేసింది.  దీంతో నిత్యావసర సరకుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.  రైతు చట్టాలకు వ్యతిరేకంగా  పంజాబ్ అసెంబ్లీ మూడు బిల్లులను ఆమోదించిన సంగతి తెలిసిందే.