President Ramnath Kovind: సమతామూర్తిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

President Ramnath Kovind: సమతామూర్తిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..
President

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీసమేతంగా ముచ్చింతల్‌ శ్రీ రామనగరంలోని సమతామూర్తిని సందర్శించుకున్నారు...

Srinivas Chekkilla

|

Feb 13, 2022 | 5:23 PM

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీసమేతంగా ముచ్చింతల్‌ శ్రీ రామనగరంలోని సమతామూర్తిని సందర్శించుకున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతోపాటు భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహగాన్ని ఆవిష్కరించారు. స్వర్ణ రామానుజాచార్యుల విగ్రహానికి రామ్‌నాథ్‌ కోవింద్ తొలి పూజ చేశారు. ఆయన ఆశ్రమమంతా కలియ దిరిగారు.108 దివ్యదేశాలను సందర్శించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు ఉన్నారు.

రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్ స్వామికి, మైహోం రామేశ్వర రావుకు రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్దేశించారని చెప్పారు. 108 దివ్యదేశాల ఏర్పాటుతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందన్నారు. ఈ క్షేత్రం ఏర్పాటుతో తెలంగాణలో కొత్త సాంస్కృతిక జీవనం మొదలైందని పేర్కొన్నారు.

అంతకుముందుగా బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్​, సీఎం స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్​లో ముచ్చింతల్​కు బయలుదేరిన రాష్ట్రపతి దంపతులు.. విహంగ వీక్షణం ద్వారా సమతామూర్తిని తిలకించారు. కేంద్రానికి చేరుకున్న వారికి.. చినజీయర్​ స్వామి స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సమతామూర్తి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు స్వర్ణమూర్తి విగ్రహానికి వేదపండితులు ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu