Actress Pranitha: చారిత్రక ఘట్టంలో తాను ఓ భాగమైన ‘బాపుగారి బొమ్మ’… అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి..

Pranitha Donation: సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉండే నటీమణుల్లో ప్రణీత ఒకరు. ఇటీవల కరోనా సమయంలో తిండి లేక ఇబ్బంది పడ్డ ఎంతో మందికి అండగా నిలిచి తనవంతు సాయం చేసిందీ అందాల తార...

Actress Pranitha: చారిత్రక ఘట్టంలో తాను ఓ భాగమైన బాపుగారి బొమ్మ... అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి..

Updated on: Jan 12, 2021 | 10:43 PM

Pranitha Donation: సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉండే నటీమణుల్లో ప్రణీత ఒకరు. ఇటీవల కరోనా సమయంలో తిండి లేక ఇబ్బంది పడ్డ ఎంతో మందికి అండగా నిలిచి తనవంతు సాయం చేసిందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రణీత సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ప్రణీతకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఓ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకున్న ప్రణీత ట్విట్టర్‌ వేదికగా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
వివరాల్లోకి వెళితే.. దశాబ్ధాల హిందువుల కలను సాకారం చేస్తూ అయోధ్య రామ మందిర నిర్మాణం మొదలైన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు కోర్టులో చర్చలు జరిగిన అనంతరం ఇటీవల రామ మందిర నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతో రామ మందిర్ నిధి పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు మందిర నిర్మాణానికి విరాళాన్ని ప్రకటించారు. తాజాగా బాపుగారి బొమ్మ ప్రణీత కూడా తనవంతు విరాళాన్ని అందించారు. ఇందుకోసం ప్రణీత రూ. లక్ష రూపాయలను అందజేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘నేను అయోధ్య రామ మందిర నిధికి రూ. లక్ష రూపాయలు అందజేశాను. మీరు కూడా ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేసింది.

Also Read: Alludu Adhurs : మాస్ సాంగ్ తో అలరించిన ‘అల్లుడు అదుర్స్’.. డ్యాన్స్ తో అదరగొట్టిన మోనాల్..

Loading...
Unable to load recommendations.
Follow Us