Pooja Hegde Instagram post: ‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ కుర్రకారు హృదయాల్లో గూడుకట్టుకున్న ఈ చిన్నది అనతి కాలంలో బడా హీరోయిన్ల సరసన నటించింది. టాలీవుడ్ బడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతోన్న పూజా… తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే పూజా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. తన పెంపుడు శునకానికి ఫుడ్ పెడుతుండగా తీసిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ చిన్నది. దానికి ఆసక్తికర క్యాప్షన్ జోడించింది. ఫొటోతో పాటు.. ‘ప్రతి ఏడాది ఒక్కొక్కరు ఒక్కో కొత్త నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా ఈ కొత్తేడాది ఎక్కువ సమయం బ్రూన్‌తోనే గడపాలని డిసైడ్ అయ్యాను.’ అని రాసుకొచ్చింది. ఇంతకీ బ్రూన్ అంటే ఎవరో అర్థమైంది కదూ.. అవును.. పూజా పెంపుడు శునకమే. ఇక పూజా హెగ్దే ప్రస్తుతం ప్రభాస్ జోడిగా ‘రాధేశ్యామ్’తో పాటు అక్కినేని యంగ్ హీరో నిఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, బాలీవుడ్‌లో ఒక సినిమాలో నటిస్తోంది.