Rajyasabha elections: పొంగులేటికి పక్కా.. కేకేకు డౌట్..

|

Feb 20, 2020 | 6:25 PM

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ రేసు మొదలైంది. సీఎం కూతురు కవిత సహా పలువురు మాజీ లోక్‌సభ సభ్యులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అదే సమయంలో దళిత, గిరిజన వర్గానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Rajyasabha elections: పొంగులేటికి పక్కా.. కేకేకు డౌట్..
Follow us on

Huge competition for Rajyasabha tickets in TRS Party: ఏపీలో రాజ్యసభ రేసు నడుస్తుంటే…..టీఆర్‌ఎస్‌లో కూడా పెద్దల సభకు వెళ్ళే నేతలపై డిస్కషన్‌ నడుస్తోంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాల దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ ఎవరికి సీటు ఇస్తారనేది ఇంట్రెస్టింగ్‌ మారింది. మాజీ ఎంపీలకు ఈసారి చాన్స్‌ ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

టీఆర్ఎస్ లో రాజ్యసభ రేసు మొదలైంది. ఈ సారి పెద్దల సభ అవకాశం ఎవరికి వస్తుందన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలో రాజ్యసభ ఎంపీలు గరికపాటి రామ్మోహన్​రావు, కేవీపీల పదవీకాలం ముగియనుంది. ఆ రెండు సీట్లకు ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఈ నెలాఖరులో నోటిఫికేషన్​ విడుదల చేసే చాన్స్​ ఉంది. దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రగతి భవన్‌కు క్యూ కడుతున్నారు.

ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేకే పదవీ కాలం కూడా ముగుస్తోంది. దీంతో ఆయనకు రెన్యువల్‌ ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్‌ నెలకొంది. కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లి కలిశారు. మరీ ఆయనకు రెస్సాన్స్‌ ఎలా వచ్చింది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక రాజ్యసభ రేసులో మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వినోద్‌ కుమార్‌, కవిత కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం సీటు పొంగులేటికి కేసీఆర్‌ ఇవ్వలేదు. దీంతో అప్పుడే రాజ్యసభ ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారట. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు దక్కే రెండు సీట్లలో ఒకటి పొంగులేటికి గ్యారెంటీ అనే టాక్ విన్పిస్తోంది.

మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ సీటు ఇవ్వాలని నిజామాబాద్​ జిల్లా నేతలు కోరుతున్నారు. లోక్​సభ ఎలక్షన్లలో ఓడిపోయినప్పటి నుంచి కవిత యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల టైంలోనూ జిల్లాకు వెళ్లలేదు. ఈ జిల్లా నుంచి మాజీ స్పీకర్ సురేశ్​రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​రావు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ స్పీకర్ మధుసుదనాచారి పెద్దల సభకు వెళ్లాలని తెగ ట్రై చేస్తున్నారట. అయితే ఆయనకు చాన్స్‌ ఇస్తారా? లేదా? అనేది రాజకీయ, సామాజిక సమీకరణాలను బట్టి ఉంటుందని తెలుస్తోంది. టీఆర్ఎస్​ నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యసభ చాన్స్​ ఇవ్వలేదు. ప్రస్తుతం బీసీలు కేకే, బడుగు లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్, డీఎస్.. ఓసీల నుంచి సంతోష్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.

దీంతో తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ లీడర్లు కోరుతున్నారు. ఎస్సీ వర్గం నుంచి మందా జగన్నాథం, ఎస్టీల నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారట. వీళ్లే కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు బూర నర్సయ్య గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌లో ఈసారి రాజ్యసభ సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.

Also read: TRS leaders in the race for MLC tickets