ICC Womens T20 WC 2020: అమ్మాయిల ధనాధన్ క్రికెట్.. భారత్‌ వెర్సస్ ఆస్ట్రేలియా తొలిపోరు…

ICC Womens T20 WC 2020: అమ్మాయిల ధనాధన్ క్రికెట్ వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధమైంది. 2009లో మొదలైన ఈ టోర్నమెంట్ ప్రతీ సీజన్‌కు క్రేజ్‌ను పెంచుకుంటూ ఏడో ఎడిషన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో పది దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటికే నాలుగు పొట్టి క్రికెట్ గెలుచుకున్న కంగారూలు సొంతగడ్డపై పాంచ్ పటాకా సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఇండియా తొలిసారి కప్పు కైవసం చేసుకొవాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. […]

ICC Womens T20 WC 2020: అమ్మాయిల ధనాధన్ క్రికెట్.. భారత్‌ వెర్సస్ ఆస్ట్రేలియా తొలిపోరు...
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 20, 2020 | 9:45 PM

ICC Womens T20 WC 2020: అమ్మాయిల ధనాధన్ క్రికెట్ వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధమైంది. 2009లో మొదలైన ఈ టోర్నమెంట్ ప్రతీ సీజన్‌కు క్రేజ్‌ను పెంచుకుంటూ ఏడో ఎడిషన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో పది దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటికే నాలుగు పొట్టి క్రికెట్ గెలుచుకున్న కంగారూలు సొంతగడ్డపై పాంచ్ పటాకా సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఇండియా తొలిసారి కప్పు కైవసం చేసుకొవాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహాశివరాత్రి రోజు అనగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ వచ్చే నెల 8న పూర్తి కానుంది. కాగా, మొదటి మ్యాచ్ ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా సిడ్నీ వేదికగా రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.

Also Read: Virat Kohli Retirement Plans

Aslo Read: Few Changes In Team India Ahead Of First Test 

గ్రూప్‌ల వివరాలు…

గ్రూప్‌‌-ఎ: ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌‌ గ్రూప్‌‌-బి: ఇంగ్లండ్‌‌, పాకిస్థాన్‌‌, వెస్టిండీస్‌‌, దక్షిణాఫ్రికా, థాయ్‌‌లాండ్‌‌

షెడ్యూల్ టైమింగ్స్…

ఫిబ్రవరి 21-  ఇండియా x ఆస్ట్రేలియా

ఫిబ్రవరి 22- థాయ్‌‌లాండ్‌‌ x వెస్టిండీస్‌‌

న్యూజిలాండ్‌‌ x శ్రీలంక

ఫిబ్రవరి 23 – ఇంగ్లండ్ x సౌతాఫ్రికా

ఫిబ్రవరి 24 – ఆస్ట్రేలియా x శ్రీలంక

ఇండియా x బంగ్లాదేశ్‌‌

ఫిబ్రవరి 26 –  ఇంగ్లండ్‌‌ x థాయ్‌‌లాండ్‌‌

పాకిస్థాన్‌‌ x వెస్టిండీస్​

ఫిబ్రవరి 27 – ఇండియా x న్యూజిలాండ్‌‌

ఆస్ట్రేలియా x బంగ్లాదేశ్‌‌

ఫిబ్రవరి 28 – సౌతాఫ్రికా x థాయ్‌‌లాండ్‌‌

ఇంగ్లండ్‌‌ x పాకిస్థాన్‌‌

ఫిబ్రవరి 29 – బంగ్లాదేశ్‌‌ x న్యూజిలాండ్‌‌

ఇండియా x శ్రీలంక

మార్చి 1 –  పాకిస్థాన్‌‌ x సౌతాఫ్రికా

ఇంగ్లండ్‌‌ x వెస్టిండీస్‌‌

మార్చి 2 – బంగ్లాదేశ్‌‌ x శ్రీలంక

ఆస్ట్రేలియా x న్యూజిలాండ్‌‌

మార్చి 3 –  పాకిస్థాన్‌‌ x థాయ్‌‌లాండ్‌‌

సౌతాఫ్రికా x వెస్టిండీస్‌‌

మార్చి 5 –  ఫస్ట్‌‌ సెమీఫైనల్‌‌

సెకండ్‌‌ సెమీఫైనల్

మార్చి 8 – ఫైనల్‌‌