Ind Vs Nz: టీ20లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. కోహ్లీ జట్టులో కొనసాగుతాడా.?

విరాట్ కోహ్లీ.. టీమిండియాలో ఇదొక బ్రాండ్. జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కెప్టెన్‌గా రికార్డులు తిరగరాశాడు. అలాంటి మేటి ఆటగాడు 2023 వరల్డ్ కప్ తర్వాత ఓ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Ind Vs Nz: టీ20లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. కోహ్లీ జట్టులో కొనసాగుతాడా.?
Follow us

|

Updated on: Feb 20, 2020 | 9:43 PM

Ind Vs Nz Test Series: విరాట్ కోహ్లీ.. టీమిండియాలో ఒక బ్రాండ్. జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ధోని తర్వాత సారధ్య బాధ్యతలు చేపట్టి తిరుగులేని కెప్టెన్‌గా రికార్డులు తిరగరాశాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా ఫార్మాట్ ఏదైనా కోహ్లీ దూకుడుకు బ్రేక్ ఉండదు. అతడు క్రీజులోకి అడుగుపెడితే ప్రత్యర్థులకు దడ మొదలైనట్లే. అలాంటి మేటి ఆటగాడు 2023 వరల్డ్ కప్ తర్వాత ఓ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీ కూడా మూడేళ్ళ తర్వాత తన కెరీర్ గురించి ఆలోచిస్తానని వెల్లడించాడు. మూడేళ్ల త‌ర్వాత ఏవైనా రెండు ఫార్మాట్ల‌లో ఆడ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు.

Also Read: ICC Womens T20 World Cup Schedule

ఇలాంటి తరుణంలో టీ20లకే అతడు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంత ఒత్తిడి ఉన్నా.. బిజీ షెడ్యూల్స్‌లో కూడా అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకుంటూ కోహ్లీ రొటేషన్ చేస్తూ వస్తున్నాడు. ఎక్కువగా టీ20లకే జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అయితే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. కెప్టెన్‌గా వ్యవహరించిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాడు. అటు ఇతర దేశాలకు.. వివిధ ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్‌లు వ్యవహరిస్తున్నారు. అదే పంథాను ఇండియా కూడా అనుసరిస్తే.. టీ20లకు కెప్టెన్‌‌గా రోహిత్ శర్మ సెట్ అవుతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతేకాక కోహ్లీ జట్టు సభ్యుడిగా ఉంటే.. టీమిండియాకు విజయాల పరంపర కొనసాగుతుందని వారి అంచనా.

Also Read: Few Changes In Team India Ahead Of First Test

ఇదివరకు ధోని కూడా వన్డేలకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకుని కోహ్లీకి వెనక నుంచి ఎన్నో కీలక పరిణామాల్లో అండగా ఉన్నాడు. అంతేకాక జట్టు సభ్యుడిగా అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే విధంగా కోహ్లీ-రోహిత్‌ల జోడిలో టీమిండియా అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ స్థానం చేజిక్కించుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కోహ్లీసేన ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై కన్నేసింది. కివీస్‌తో మొదటి టెస్ట్ రేపు వెల్లింగ్టన్ వేదికగా మొదలు కానుంది. గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.